తను విజయవాడకు చెందిన ఓ వ్యాపారవేత్త: తన ప్రేయసి గురించి క్లూ ఇచ్చిన రాజ్ తరుణ్
- నా పుట్టినరోజు నాడు ఆమెను చూశా
- ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం
- అందరి దృష్టిలో పడటం తనకు ఇష్టం లేదు
- నేను ఎప్పటి నుంచో పెళ్లికి సిద్ధం
ఆమె విజయవాడకు చెందిన యువతి అని, తనో వ్యాపారవేత్త అని, సింపుల్‌గా ఉండే తెలుగింటి అమ్మాయని తెలిపాడు. అందరి దృష్టిలో పడటం తనకు ఇష్టం లేదని, అందుకే తన పేరును వెల్లడించడం లేదన్నాడు. ఆరేళ్ల క్రితం వైజాగ్‌లో తన పుట్టినరోజును జరుపుకున్న సందర్భంగా తొలిసారిగా ఆమెను చూశానని, తమ అభిరుచులు కలవడంతో తామిద్దరి మధ్య ప్రేమ మొదలైందని తెలిపాడు. తామిద్దరం తరచూ కలుస్తుంటామని ప్రస్తుతం జీవితాంతం ఒకరికొకరం అనే ఫీలింగ్‌లో ఉన్నామని తెలిపాడు. తమ తల్లిదండ్రులు కూడా పెళ్లికి అంగీకరించారని, తాను ఎప్పటి నుంచో పెళ్లికి సిద్ధమని తనే ఆలస్యం చేస్తోందని రాజ్ తరుణ్ అన్నాడు. వచ్చే ఏడాది తామిద్దరం పెళ్లి పీటలెక్కాలనుకుంటున్నట్టు తెలిపాడు.