భద్రాచలం ఏపీకా...అటువంటి ప్రతిపాదన ఏదీ లేదే!: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టీకరణ
- ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి
- ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్పష్టీకరణ
- ఉమ్మడి ప్రయోజనాల కోసం సీఎంలు కలిసి పనిచేస్తున్నారని వివరణ
పైగా, హైదరాబాద్‌లోని ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం, రెండు రాష్ట్రాల ప్రయోజనాలకోసం ఏపీ సీఎంతో కలిసి పనిచేస్తామని సీఎం కేసీఆర్ పదేపదే చెప్పడంతో ఈ ఊహాగానాలకు తెరలేచింది. అయితే ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇవన్నీ ఒట్టి ఊహాగానాలే అని కొట్టి పారేశారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రులు కలిసి పనిచేస్తారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.