భారత్-ఆసీస్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన విజయ్ మాల్యాకు చేదు అనుభవం!
- భారత్-ఆసీస్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన మాల్యా
- అతడిని చూడగానే రెచ్చిపోయిన ప్రేక్షకులు
- విజయ్ మాల్యా దొంగ అంటూ నినాదాలు
అయితే, చుట్టూ ఉన్న ప్రేక్షకులు మాల్యాను చూడగానే రెచ్చిపోయారు. ‘విజయ్ మాల్యా చోర్ హై, చోరో.. చోర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘మనిషిలా ప్రవర్తించు.. దేశానికి క్షమాపణలు చెప్పు’ అన్న నినాదాలు కూడా వినిపించాయి. దీనికి స్పందించిన విజయ్ మాల్యా.. ‘సరే అలాగే చేద్దాం’ అని బదులివ్వడం విశేషం.
ప్రేక్షకులు దొంగ, దొంగ అని అరుస్తుండడాన్ని గమనించిన మీడియా.. మాల్యాను పలకరించింది. వారు అలా అరుస్తుంటే మీకేమనిపించిందని ప్రశ్నించగా, తన తల్లి బాధపడకుండా చూసుకున్నానని జవాబిచ్చాడు.