నేను వచ్చింది టీమిండియా మ్యాచ్ చూడ్డానికి... లండన్ స్టేడియంలో విజయ్ మాల్యా ప్రత్యక్షం
- వరల్డ్ కప్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన మాల్యా
- పలకరించిన మీడియా
- సీరియస్ గా బదులిచ్చిన మాల్యా
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ చూడ్డానికి వచ్చారు. ఈ సందర్భంగా, ఆయనను మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది. కోర్టులో ఉన్న కేసుల వివరాలు అడిగిన ఓ మీడియా ప్రతినిధి వైపు తీక్షణంగా చూసిన మాల్యా... నేను ఇక్కడికి వచ్చింది క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి అంటూ అక్కడ్నించి గంభీరంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ మ్యాచ్ కోసం మాల్యా తనయుడు సిద్ధార్థ్ కూడా వచ్చారు.