Talasani: ఏపీలో మంత్రివర్గ కూర్పు అద్భుతంగా ఉంది: తలసాని

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో సీఎం జగన్ నాయకత్వంలో కొలువుదీరిన కొత్త క్యాబినెట్ పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో కొత్త మంత్రివర్గ కూర్పు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం దక్కినట్టు కనిపిస్తోందని అన్నారు. ముఖ్యంగా, దళితులకు, బీసీలకు క్యాబినెట్ లో  పెద్దపీట వేశారంటూ తలసాని హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో రానున్న ఐదేళ్లకాలంలో జగన్ సర్కారు సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఏపీలో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Go Back to Shorts
Talasani
Jagan
Andhra Pradesh

More Telugu News