సీఎం జగన్ కు ఊరట.. సీబీఐ కోర్టుకు హాజరు నుంచి తాత్కాలిక మినహాయింపు!
- వైసీపీ నేత విజయసాయిరెడ్డికి కూడా
- సీఆర్పీసీ సెక్షన్ 317 కింద పిటిషన్ దాఖలు
- రెండు పిటిషన్లను అనుమతించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 317 కింద అశోక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యుల సమావేశంలో ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు పేర్కొన్నారు. వాదనలు విన్న సీబీఐ స్పెషల్ కోర్టు ఈ రెండు పిటిషన్లను అనుమతిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.