jagan: తన కార్యాలయం నుంచి జగన్ తొలి ట్వీట్ ఇదే

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఉదయం 8.39 నిమిషాలకు సెక్రటేరియట్ లోని తన కార్యాలయంలోకి అడుగుపెట్టారు. పురోహితుల వేద మంత్రోచ్చారణ మధ్య తన సీటులో ఆసీసులయ్యారు. అనంతరం మూడు ఫైళ్లపై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తొలి ట్వీట్ చేశారు. 'భగవంతుడు, మీ అందరి ఆశీస్సులతో మీ ఆకాంక్షలను నెరవేర్చుతా. మీ అంచనాలకు తగ్గట్టుగా బాధ్యతలను నిర్వహిస్తా' అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
Go Back to Shorts
jagan
secretariat
ysrcp

More Telugu News