నితిన్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన ప్రియా వారియర్?

  • ప్రియా వారియర్ కి యూత్ లో క్రేజ్ 
  • కలిసిరాని తొలిప్రయత్నం 
  • చంద్రశేఖర్ యేలేటి సినిమాలో ఛాన్స్  
మలయాళంలో ప్రియా వారియర్ చేసిన సినిమా, అక్కడే కాదు మిగతా భాషల్లోను ఆశించిన స్థాయిలో ఆడలేదు. తెలుగులో 'లవర్స్ డే' పేరుతో విడుదలైన ఈ సినిమాకి, యూత్ నుంచి రెస్పాన్స్ కరువైంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయికి ఇక్కడ అవకాశాలు రాకపోవచ్చనే అంతా అనుకున్నారు. కానీ తాజాగా ప్రియా వారియర్ తెలుగులో ఒక ఛాన్స్ కొట్టేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియా వారియర్ ను తీసుకున్నారని అంటున్నారు. 'మనమంతా' తరువాత చంద్రశేఖర్ యేలేటి నుంచి రానున్న సినిమా ఇదే. నితిన్ 'భీష్మ' పూర్తయిన తరువాత, చంద్రశేఖర్ యేలేటి ప్రాజెక్టుకి సంబంధించిన క్లారిటీ రానుంది. 
Go Back to Shorts
nithin
priya varrier

More Telugu News