sandeep vanga: మా అబ్బాయికి 'అర్జున్ రెడ్డి' అని పేరు పెట్టుకున్నాను: దర్శకుడు సందీప్ రెడ్డి వంగా

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో కొంతకాలం క్రితం వచ్చిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని సాధించింది. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగాను తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెట్టింది. దాంతో ఆయన ఇదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమా ఈ నెల 21వ తేదీన బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది.

ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ .. 'అర్జున్ రెడ్డి' నేను ఎంతో ప్రాణం పెట్టి సృష్టించిన పాత్ర. ఈ కథను ఒక తపస్సులా భావించి తెరకెక్కించాను. నిర్మాతలుగా నా కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. అలాంటి 'అర్జున్ రెడ్డి' మేమందరం ఎప్పటికీ మరిచిపోలేని విజయాన్ని అందించాడు. అందుకే మా అబ్బాయికి 'అర్జున్ రెడ్డి' అనే పేరు పెట్టుకున్నాను. ఆ సినిమా అంటే నాకు ఎంత ఇష్టమనేది ఇప్పుడు మీకు అర్థమైపోయుంటుంది. 'కబీర్ సింగ్' కూడా ఎవరినీ నిరాశపరచడు" అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
sandeep vanga

More Telugu News