వారానికోసారి న్యాయస్థానం ఎదుట హాజరు కావాల్సిందే: సాధ్వి ప్రజ్ఞకు ఎన్ఐఏ కోర్టు ఆదేశం
- మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి నిందితురాలు
- మినహాయింపు కుదరదన్న కోర్టు
- నిందితులంతా హాజరు కావాల్సిందేనంటూ ఆదేశాలు
29 సెప్టెంబరు 2008న మహారాష్ట్రలోని మాలెగావ్‌లో బైక్ బాంబు పేలి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు ఉపయోగించిన బైక్ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ది కావడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏడుగురు నిందితులు ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. సోమవారం జరిగిన విచారణకు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. మిగతా నలుగురు సోమవారం నాటి విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో స్పందించిన న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.