Revanth Reddy: దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగు.... మరి హిందీ రాష్ట్రాలలో తెలుగు భాషను కూడా నిర్బంధం చేయగలరా?: రేవంత్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
హిందీని దక్షిణాది రాష్ట్రాల్లో నిర్బంధ పాఠ్యాంశంగా చేయాలన్న కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సులపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హిందీ భాషను తెలుగు రాష్ట్రాలపై బలవంతంగా రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది తమ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగేనని, అలాంటప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు భాషను కూడా నిర్బంధ పాఠ్యాంశంగా చేయగలరా? అని ప్రశ్నించారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలుగుభాష మూడోస్థానానికి పడిపోయిందని రేవంత్ ఆక్రోశించారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress

More Telugu News