జగన్, కేసీఆర్ కలిసి సాగడం అభినందనీయం : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- తెలుగు రాష్ట్రాలకు ఇది మేలు చేసే ప్రయత్నం
- పెండింగ్ అంశాల పరిష్కారం దిశగా అడుగులు
- వారి ప్రయత్నం సఫలం కావాలని ఆశిస్తున్నా
ఐదేళ్ల నుంచి ఎటూ తేలని వివాదాల విషయంలో ఇరు రాష్ట్రాలు ఉమ్మడి అవగాహనతో ముందుకు నడిచి వాటి పరిష్కారానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం జోక్యం లేకుండా పరిష్కరించుకుంటే ఇంకా మంచిదన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రయత్నం సఫలం కావాలని తాను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానన్నారు. గడచిన ఐదేళ్లలోనూ తాను ఇదే కోరుకున్నానని, అనుకోని కారణాల వల్ల ఇది సాధ్యంకాకపోవడం నిరాశ కలిగించిందన్నారు. పాలనా సౌలభ్యం, సత్వర అభివృద్ధి కోసం రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.