మోదీతో డిన్నర్ కు వెళ్లాలనుందని సల్మాన్ కు చెప్పిన కత్రినా కైఫ్!
- 'భారత్' సినిమా ప్రమోషన్ లో సల్మాన్, కత్రినా
- సల్మాన్ తో ఇంతవరకూ డిన్నర్ చేయలేదన్న కత్రినా
- తాను కుటుంబీకులతోనే తింటానన్న సల్మాన్
ఇదే సమయంలో పక్కనే ఉన్న సల్మాన్ కల్పించుకుని, ఈ జాబితాలో తాను లేనా? అని ప్రశ్నించాడు. దానికి కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన కత్రినా, తాను ఇంతవరకూ సల్మాన్ తో డిన్నర్ చేయలేదని, ఆయన ఎప్పుడూ బయట డిన్నర్ చేయకపోవడమే ఇందుకు కారణమని అంది.
ఆపై సల్మాన్ మాట్లాడుతూ, కత్రినా కైఫ్ తన డిన్నర్ ను సాయంత్రం ఆరున్నర గంటలకే ముగించేస్తుందని, తాను ఆ సమయంలో లంచ్ చేస్తానని ఫన్నీ వ్యాఖ్యలు చేశాడు. లంచ్ అయినా, డిన్నర్ అయినా కుటుంబ సభ్యులతో కలిసి చేయడమే తనకు అలవాటని అన్నాడు.