కూతురి మరణాన్ని తట్టుకోలేక... గంటలోపే ఆగిన తండ్రి గుండె!
- జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ కు బాల్ రాజు
- బెంగ పెట్టుకున్న బిడ్డకు తీవ్ర అనారోగ్యం
- బిడ్డ మృతిని తట్టుకోలేక మరణించిన తండ్రి
ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్ రాజు, శుక్రవారం నాడు గ్రామానికి వచ్చాడు. కుమార్తెను చూసి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. అయినా ఫలితం దక్కక ఆమె మరణించింది. లావణ్య మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కాసేపటికే బాల్ రాజు గుండెపోటుతో కుప్పకూలాడు. బిడ్డ మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆయన, గంట వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన కుటుంబం శోకసంద్రమైంది. యూత్ కాంగ్రెస్, అంబేద్కర్ యువజన సంఘం తదితరాల్లో చురుకుగా ఉండే బాల్ రాజు మృతిపట్ల అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సంతాపాన్ని వెలిబుచ్చారు.