'మహర్షి' వసూళ్లపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహర్షి' వసూళ్లపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

  • నాల్గొవ వారంలోకి అడుగుపెట్టిన 'మహర్షి'
  • నైజామ్ లో 30 కోట్ల షేర్ కి దగ్గరలో
  •  సమ్మర్లో లభించిన భారీ హిట్  
మహేశ్ బాబు కథానాయకుడిగా ఈ నెల 9వ తేదీన 'మహర్షి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వసూళ్లకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటికి వస్తూనే వున్నాయి. అయితే కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లకు 'మహర్షి' నష్టాలు తెచ్చిపెట్టిందనీ, అసలైన వసూళ్ల విషయంలో నిర్మాతలు కూడా అసంతృప్తితో వున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

దాంతో ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఈ విషయంపై స్పందిస్తూ, 'మహర్షి' మూడువారాలను పూర్తిచేసుకుని నాల్గొవ వారంలోకి అడుగుపెట్టింది. ఇంతవరకూ ఈ సినిమా 100 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా ఇంకో రెండు మూడు రోజుల్లో 30 కోట్ల షేర్ మార్క్ ను చేరుకోనుంది. మహేశ్ బాబు కెరియర్లో అత్యధిక షేర్ ను రాబట్టిన సినిమాగా 'మహర్షి' నిలిచింది. సమ్మర్ సీజన్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా వున్నాము" అని చెప్పుకొచ్చారు. 
Mahesh Babu
pooja hegde

More Telugu News