Mahesh Babu: మహేశ్ బాబుకి హిట్ ఇచ్చేసి రుణం తీర్చుకుంటాను: దర్శకుడు అనిల్ రావిపూడి

  • మహేశ్ 26వ సినిమాగా 'సరిలేరు నీకెవ్వరు'
  • నిర్మాణంలో మహేశ్ భాగస్వామ్యం
  •  సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  

మహేశ్ బాబు 26వ సినిమాగా 'సరిలేరు నీకెవ్వరు' అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "నా జీవితంలో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఇది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన  మహేశ్ బాబుగారిని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సినిమాతో ఆయనకి హిట్ ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటాను. ఈ సినిమాను దిల్ రాజు గారు .. అనిల్ సుంకరగారు .. మహేశ్ బాబుగారు కలిసి నిర్మిస్తున్నారు. 13 సంవత్సరాల తరువాత విజయశాంతిగారు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. నాపై నమ్మకంతో ఆమె ఈ పాత్ర చేయడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక మహేశ్ జోడీగా రష్మిక .. ముఖ్యమైన పాత్రలో జగపతిబాబు చేయనున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము" అని ఆయన చెప్పారు.

More Telugu News