పులి బారి నుంచి కాపాడమంటున్న ప్రజలు!

రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం మైసగండి ప్రాంతంలో ఓ పులి సంచరిస్తుండటం ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది. వ్యవసాయ పొలాల్లోకి వచ్చిన పులి, అక్కడ నివసించేవారి పశు సంపదపై దాడులకు దిగుతోంది. ఇప్పటికే ఓ ఆవును, మూడు దూడలపై దాడి చేసి, వాటిని చంపింది. పులి తిరుగుతూ ఉండటంపై ఆందోళన చెందుతున్న మైసగండి వాసులు, వెంటనే అటవీ శాఖాధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఇది మనుషులపై దాడి చేయకముందే దాని బారి నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.
Go Back to Shorts
Ranga Reddy District
Tiger
Kadtal
Cow

More Telugu News