నీరవ్ మోదీని అప్పగిస్తే ఏ జైల్లో ఉంచుతారో చెప్పండి... భారత ప్రభుత్వాన్ని కోరిన యూకే కోర్టు
- భారత్ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి
- లండన్ లో తలదాచుకున్న వైనం
- జూన్ 27కి విచారణ వాయిదా వేసిన న్యాయస్థానం
ఈ సందర్భంగా, నీరవ్ మోదీని అప్పగిస్తే అతడిని ఏ జైల్లో ఉంచుతారో చెప్పాలంటూ న్యాయస్థానం భారత్ ను కోరింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి 14 రోజుల గడువు విధించింది. కాగా, భారత వర్గాలు నీరవ్ మోదీని ముంబయి ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని న్యాయమూర్తితో చెప్పినట్టు సమాచారం.