bhavana: నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలంటే భయం: నటి భావన

షార్ట్స్‌లో చూడండి
బుల్లితెరకి గ్లామర్ తీసుకొచ్చిన తారలలో భావన ఒకరు. ఎన్నో ధారావాహికల్లో ఆమె విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించారు. అలాంటి భావన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఎన్నో నిర్మాణ సంస్థలు నిర్మించిన ధారావాహికల్లో నటించాను. నిర్మాణ రంగంలోని సాధక బాధలను చాలా దగ్గరగా చూశాను.

సొంతంగా సీరియల్స్ ను నిర్మించాలనే ఆసక్తి మా ఆయనకి వుంది. అప్పుడే అలాంటి సాహసాలు చేయవద్దులే అని నేను అంటూ వుంటాను. ఎందుకంటే ఫలానా ప్రొడక్షన్ వాళ్లు సరిగ్గా డబ్బులు ఇవ్వరనీ .. ఫలానా ప్రొడక్షన్ వాళ్లు మంచి భోజనం పెట్టలేదని చెప్పుకుంటూ ఉండటం నేను వింటూ వుంటాను. అలాంటి మాటలు నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. అన్ని విషయాలు దగ్గరుండి చూసుకోలేము కనుక, మనకెందుకులే ఈ నిర్మాణం వ్యవహారాలు అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
bhavana

More Telugu News