బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు: సల్మాన్ ఖాన్
- 'బాహుబలి' తొలి భాగాన్ని మాత్రమే చూశాను
- రెండో భాగాన్ని చూడలేదు
- రెండో భాగంలో ఏం జరిగిందో నాకు తెలియదు
ప్రస్తుతం తన చిత్రం 'భారత్' ప్రమోషన్ కార్యక్రమాల్లో సల్లూ భాయ్ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా ఆయన మీడియాతో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ, మీరు 'బాహుబలి' చిత్రాలు చూశారా? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా తాను మొదటి భాగాన్ని మాత్రమే చూశానని... రెండో భాగాన్ని చూడలేదని సల్మాన్ సమాధానమిచ్చాడు. అందుకే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని తెలిపాడు. రెండో భాగంలో ఏం జరిగిందో కూడా తనకు తెలియదని అన్నాడు.