Vijayawada: పైపుల రోడ్డుకు రావాలన్న నా కోరిక ‘హండ్రెడ్ పర్సెంట్’ నెరవేరింది: రామ్ గోపాల్ వర్మ

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు నందమూరి ఎన్టీ రామారావుకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నివాళులర్పించారు. విజయవాడలోని పైపుల రోడ్డు సెంటర్ కు వర్మ, నిర్మాత రాకేశ్ రెడ్డి కారులో వెళ్లారు. ఆ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి వర్మ పూల మాల వేశారు. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో వర్మ మాట్లాడుతూ, ‘స్వర్గీయ ఎన్టీఆర్ గారి దయ వల్ల’ ఎట్టకేలకు పైపుల రోడ్డు సెంటర్ కు రావాలన్న తన కోరిక ‘హండ్రెడ్ పర్సెంట్’ నెరవేరిందని అన్నారు. కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రెస్ మీట్ పైపుల రోడ్డులో నిర్వహించేందుకు ఇటీవల అక్కడికి వెళ్లాలనుకున్న వర్మకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Vijayawada
payakapuram
ppipula road
varma

More Telugu News