Andhra Pradesh: ఫ్యాక్షన్ ను ఫ్యాషన్ గా మార్చేశారు.. అందుకే పరిటాల రవికి ఫ్యాన్స్ ఉన్నారు!: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తమ ప్రాంతం ఫ్యాక్షన్ కు కేంద్రం కాదని అనంతపురం వైసీపీ నేత, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. తరిమెల నాగిరెడ్డి లాంటి కమ్యూనిస్టు యోధులు కూడా ఇక్కడే జన్మించారని గుర్తుచేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. అనంతపురం జిల్లాలో రక్తచరిత్ర ఉన్నవాళ్లంతా టీడీపీలోనే ఉన్నారని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ ను ఫ్యాషన్ గా మార్చి సినిమా తీయడం ద్వారానే పరిటాల రవికి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారని స్పష్టం చేశారు.

చెడును తొందరగా ప్రజల్లోకి వెళుతుంది కాబట్టి ఆయన పాప్యులర్ అయ్యారని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఓ రాజకీయ నాయకుడు పది మందికి లబ్ధి కలిగేలా, పది మందికి అన్నం పెట్టేలా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించడం, ఇళ్లు కట్టించడం వంటి విషయాల్లో పరిటాల కుటుంబానికి జీరో మార్కులు వస్తాయని ఎద్దేవా చేశారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేస్తే రాప్తాడులో పరిటాల కుటుంబం ఇకపై గెలవదని జోస్యం చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
Anantapur District
RAPTADU

More Telugu News