హీరోయిన్ తలకు తుపాకి గురిపెట్టి... బలవంతపు వివాహయత్నం... గంటన్నర పాటు హైడ్రామా!
- షూటింగ్ నిమిత్తం వచ్చిన నటి
- హోటల్ లో బంధించి పెళ్లి చేసుకోవాలని వేధింపులు
- ఒకరికి తీవ్రగాయం, తప్పించుకున్న ఎస్పీ
మరిన్ని వివరాల్లోకి వెళితే, జానుపూర్ ప్రాంతానికి చెందిన పంకజ్ యాదవ్ (25), ఈ హోటల్ లో తన అభిమాన నటి ఉందని తెలుసుకుని వచ్చాడు. ముంబై నుంచి ఓ సినిమా షూటింగ్ నిమిత్తం 70 మందితో కూడిన సిబ్బంది ఈ ప్రాంతానికి వచ్చింది. వీరిలో హీరోయిన్ రీతూ సింగ్, దర్శకుడు రితీశ్ థాకూర్ తదితరులు కూడా ఉన్నారు. నిందితుడు నివసించే ప్రాంతానికే చెందిన రీతూ సింగ్, ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంటూ, భోజ్ పురి చిత్రాల్లో నటిస్తోంది.
పంకజ్ ను అదుపులోకి తీసుకుని లాక్కెళుతున్న పోలీసులుఉదయం 11 గంటల ప్రాంతంలో తుపాకితో హోటల్ లోకి వచ్చిన పంకజ్, ఆమె ఉన్న ప్రాంతానికి చేరుకుని బెదిరింపులకు దిగాడు. వెంటనే తనను పెళ్లి చేసుకోవాలని తలకు తుపాకిని గురి పెట్టడంతో ఆమె భయభ్రాంతులకు గురైంది. ఘటనను గమనించిన అశోక్ అనే స్థానిక యువకుడు అడ్డుకోబోగా, పంకజ్ ఫైరింగ్ ఓపెన్ చేశాడు. దీంతో అశోక్ కు బులెట్ గాయమైంది. తుపాకి శబ్దాన్ని విన్న హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్పీ జాఫర్ తేజ్ పాటిల్ తన టీమ్ తో అక్కడికి వచ్చి పంకజ్, రీతూ ఉన్న గదికి చేరుకుని అతన్ని లొంగిపోవాలని హెచ్చరించారు.
అప్పటికీ వినని పాటిల్, ఎస్పీవైపు, రీతూ వైపు తుపాకిని గురిపెడుతూ, కాల్చేస్తానని హెచ్చరికలకు దిగాడు. ఆపై దాదాపు గంటన్నర పాటు హైడ్రామా నడిచింది. పోలీసులు కౌన్సెలింగ్ చేస్తూ, నెమ్మదిగా మాటల్లోకి దింపి, పంకజ్ తుపాకిని లాగేసుకునే ప్రయత్నం చేయగా, ఆ సమయంలో మరో బులెట్ ను పేల్చాడు. అది గురితప్పి నేలను తాకిందని ఎస్పీ పాటిల్ వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కేసును విచారిస్తున్నామని ఆయన తెలిపారు.