Sararani: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శారారాణి కన్నుమూత!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి ఈ ఉదయం కన్నుమూశారు. 2004లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత శారారాణి, తన అసమ్మతి స్వరాన్ని వినిపించడంతో టీఆర్ఎస్ అధినేత ఆమెను పక్కనబెట్టారు. కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కొంతకాలం ఆసుపత్రిలో చికిత్సను పొందారు. శారారాణి మృతిపై పలువురు రాజకీయ నేతలు సంతాపాన్ని వెలిబుచ్చారు. 
Go Back to Shorts
Sararani
Died
TRS

More Telugu News