కర్నూలు జిల్లాలో కూలీలకు దొరికిన వజ్రాలు.. రూ.1.4 లక్షలకు కొనుగోలు చేసిన వ్యాపారులు
- ఇక్కడ భూమిలో వజ్రాలు పుష్కలంగా ఉన్నాయని నమ్మకం
- జొన్నగిరిలో కూలీలకు దొరికిన వజ్రాలు
- కొనుగోలు చేసిన స్థానిక వ్యాపారులు
తాజాగా శుక్రవారం కురిసిన భారీ వర్షానికి రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. పొలం పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలకు ఇవి దొరికాయి. విషయం తెలుసుకున్న స్థానిక వ్యాపారులు ఒక వజ్రాన్ని రూ.1.10 లక్షలకు కొనుగోలు చేయగా, నాణ్యత తక్కువగా ఉన్న మరో వజ్రాన్ని రూ.30 వేలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.