Andhra Pradesh: మా కన్నా బాగా పని చేస్తారని భావించిన ఓటర్లు అవతలి వాళ్లకు అవకాశం ఇచ్చారు: జేసీ ప్రభాకర్ రెడ్డి
ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి కూడా ఓటమి చవిచూశారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి సీఎంగా తమ నాయకుడు చంద్రబాబు చేసిన అభివృద్ధి, తాడిపత్రిలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి ప్రజలకు నచ్చలేదు కనుకే వద్దనుకున్నారని వ్యాఖ్యానించారు.
మా కన్నా బాగా పని చేస్తారని భావించిన ఓటర్లు అవతలి వాళ్లకు అవకాశం ఇచ్చారని, ఇందుకు తాము బాధపడటం లేదని అన్నారు. ఎవరు బాగా పనిచేస్తారంటే వారిని ఎన్ను కోవడంలో తప్పు లేదని, ఇన్నాళ్లూ తమను ప్రజలు ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, దాని గురించి ఆలోచించే సమయం ఇంకా ఉందని చెప్పారు. ‘గెలుపు ముఖ్యం కాదు, మా కార్యకర్తలను కాపాడుకోవాలి’ అని అన్నారు.