cuddapah: పులివెందులలో వైఎస్ జగన్ ఘన విజయం
వైసీపీ అధినేత జగన్ ఘన విజయం సాధించారు. కడప జిల్లా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జగన్ భారీ మెజార్టీ సాధించారు. ప్రత్యర్థి సతీశ్ రెడ్డిపై 90,543 ఓట్ల మెజార్టీతో జగన్ విజయ ఢంకా మోగించారు. గతంలో కంటే జగన్ సాధించిన మెజార్టీ భారీగా పెరిగినట్టు సమాచారం. జగన్ సాధించిన మెజార్టీపై పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ కు అభినందనలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు.