ఈ నెల 30న జగన్ ప్రమాణస్వీకారం.. స్వరూపానంద స్వామితో ఫోన్ లో మాట్లాడిన జగన్!

  • ఏపీలో వైసీపీ ప్రభంజనం 
  • 150 స్థానాల్లో లీడ్ లో దూసుకుపోతున్న వైసీపీ
  • ఎల్లుండి వైసీపీ శాసనసభాపక్ష సమావేశం
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో 150 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వచ్చిన నేపథ్యంలో జగన్ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో ఫోన్ లో మాట్లాడారు. ఆయన సూచన మేరకు ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఎల్లుండి (మే 25న) వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
YSRCP
Telugudesam
Chandrababu
resign

More Telugu News