ఓటమి భయంతో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది: దివ్యవాణి

ఓటమి భయంతో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని ప్రముఖ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఓ ప్రణాళిక ప్రకారం వైసీపీ చేస్తున్న అరాచకాలను టీడీపీపై రుద్దేందుకు చూస్తోందన్నారు. కౌంటింగ్ రోజు వైసీపీ నేతలు ఎలాంటి అల్లర్లూ సృష్టించకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైసీపీ అధినేత జగన్ క్విడ్‌ప్రోకో ద్వారా రాష్ట్ర పరువును తీయడమే కాకుండా, కేసులు మాఫీ చేసుకునేందుకు పక్క రాష్ట్ర సీఎం ముందు ఏపీ పరువును తాకట్టు పెట్టారని విమర్శించారు. కోటి మంది మహిళలతో పాటు 70 లక్షల మంది అన్నదాతలు చంద్రబాబు పక్షాన నిలిచారని దివ్యవాణి పేర్కొన్నారు.
Go Back to Shorts
Jagan
Divya Vani
Chandrababu
YSRCP
Formers

More Telugu News