నిధి అగర్వాల్ మంచి చాన్స్ పట్టేసింది
- తెలుగులో పలకరించని సక్సెస్
- షూటింగు దశలో 'ఇస్మార్ట్ శంకర్'
- తమిళంలో జయం రవి జోడీగా ఛాన్స్
ఈ రెండు సినిమాల తరువాత ఆమె ఒక్క 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో మాత్రమే అవకాశాన్ని అందుకోగలిగింది. చిత్రీకరణ పరంగా ముగింపుదశకి చేరుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి తమిళంలో ఒక ఛాన్స్ దక్కించుకుంది. తమిళంలో జయం రవి హీరోగా 'బోగన్' ఫేమ్ లక్ష్మణ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ కి అవకాశం దక్కింది. హోమ్ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.