ఏపీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు.. హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు!
- నెల్లూరు జిల్లాలో శ్రీలంక పడవ లభ్యం
- ఉగ్రవాదులే వచ్చుంటారని నిఘావర్గాల హెచ్చరిక
- కొత్త వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల ఆదేశం
ఆ బోటుపై శ్రీలంక అని రాసి ఉంది. దీంతో జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల శ్రీలంకలో ఐసిస్ అనుబంధ సంస్థగా ఉన్న నేషనల్ తౌహీద్ జమాత్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడి 258 మందిని చంపేశారు. దీంతో ఆ సంస్థకు చెందిన ఉగ్రవాదులే భారత్ లోకి ప్రత్యేక బోట్ ద్వారా ప్రవేశించి ఉంటారని నిఘావర్గాలు హెచ్చరించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అలాగే కోస్ట్ గార్డ్ దళాలను అప్రమత్తం చేశారు. శ్రీహరికోటలో భద్రతను భారీగా పెంచారు.