lawrence: నిర్మాతల పద్ధతి నచ్చలేదు.. అందుకే హిందీ 'కాంచన' దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాను: లారెన్స్

  • నాకు చెప్పకుండా అక్షయ్ లుక్ రిలీజ్ చేశారు  
  • అక్షయ్ కుమార్ తో సమస్య లేదు
  • అక్షయ్ పట్ల గౌరవంతో స్క్రిప్ట్ ఇచ్చేశాను

తెలుగులో లారెన్స్ కథానాయకుడిగా ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'కాంచన' భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ సినిమాను అక్షయ్ కుమార్ కథానాయకుడిగా హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగిపోయాయి. ఈ రీమేక్ కి లారెన్స్ నే దర్శకుడిగా తీసుకున్నారు. తుషార్ కపూర్ .. షాబినా ఖాన్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇటీవలే అక్షయ్ కుమార్ గెటప్ కి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. ఆ వెంటనే తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టుగా లారెన్స్ ప్రకటించారు. ఈ విషయంపై లారెన్స్ మాట్లాడుతూ .. "నాకు తెలియకుండా .. నాతో ఒక మాటైనా చెప్పకుండా ఈ సినిమా నుంచి అక్షయ్ కుమార్ లుక్ ను రిలీజ్ చేశారు. దర్శకుడికి తెలియకుండా నిర్మాతలు ఈ విధంగా చేయడం నాకు నచ్చలేదు .. అందుకే తప్పుకున్నాను. నాకు అక్షయ్ కుమార్ తో ఎలాంటి సమస్యా లేదు .. ఆయనంటే గౌరవం వుంది. అందుకే స్క్రిప్ట్ మాత్రం ఇచ్చేశాను" అని ఆయన చెప్పుకొచ్చారు.

More Telugu News