విక్రమ్ హీరోగా భారీ యాక్షన్ థ్రిల్లర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విక్రమ్ హీరోగా భారీ యాక్షన్ థ్రిల్లర్

  • అజయ్ జ్ఞానముత్తు నుంచి యాక్షన్ థ్రిల్లర్ 
  • ఆగస్టులో షూటింగు మొదలు 
  • వచ్చే వేసవి సెలవుల్లో విడుదల  
కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి విలక్షణమైన పాత్రలకు .. ప్రయోగాత్మక పాత్రలకి విక్రమ్ ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. ఈ కారణంగానే తమిళ స్టార్ హీరోల్లో విక్రమ్ స్థానం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఆయన తమిళ యువ కథానాయకులతో పోటీపడి సినిమాలు చేస్తున్నాడు. అలా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ఆయన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.

'డిమాంటీ కాలనీ' .. 'ఇమైక్కా నోడిగళ్' తో మంచి పేరు తెచ్చుకున్న అజయ్ జ్ఞానముత్తు. ఈ సారి ఒక యాక్షన్ థిల్లర్ మూవీని ప్లాన్ చేశాడు. ఆగస్టులో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు చేస్తున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను థియేటర్స్ కి తీసుకురానున్నారు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
vikram

More Telugu News