స్వాతంత్ర్య సమరయోధుడు దావులూరి కన్నుమూత
- రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దావులూరి
- స్వాతంత్ర్యానంతరం ఉపాధ్యాయుడిగా సేవలు
- నేడు తిరుమలగిరిలోని స్వర్గవాటికలో అంత్యక్రియలు
యుక్తవయసులోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న దావులూరి రెండేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం ఉపాధ్యాయుడిగా పనిచేసి 1977లో రిటైరయ్యారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన స్వాతంత్ర్య సమరయోధుల పింఛనును కూడా ఆయన తిరస్కరించారు. ఈ ఉదయం 10 గంటలకు తిరుమలగిరిలోని స్వర్గవాటికలో దావులూరి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.