తెలంగాణలో ఆ రెండు సీట్లను గెలుచుకుంటాం: యడ్యూరప్ప
- దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తోంది
- 280 సీట్లతో మోదీ మరోసారి ప్రధాని అవుతారు
- త్వరలోనే కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోతుంది
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ గాలి వీస్తోందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అన్నారు. 280 సీట్లు సాధించి మోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించబోతున్నారని చెప్పారు. కర్ణాటకలో 20 నుంచి 22 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోబోతోందని తెలిపారు. ఇటీవల జరిగిన రెండు ఉపఎన్నికల తర్వాత తమ బలం మరింత పెరిగిందని చెప్పారు. త్వరలోనే కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని... అయితే, ప్రభుత్వం కూలిపోవడంలో తమ ప్రమేయం మాత్రం ఉండదని అన్నారు.