పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
- విషం తాగి బలవన్మరణం
- ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి
- బాధితుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగి
ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం రుద్రంపేటలో ఉంటున్న తండ్రి వెంకట శేషాచలపతిసాయి ఇంటికి వచ్చాడు. తండ్రి, పినతల్లి (సాయి రెండో భార్య) కలిసి ఆ మరునాడు తిరుపతి వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన నందకుమార్ సోమవారం రాత్రి విషం తాగి చనిపోయాడు. తల్లిదండ్రులు తిరుపతి నుంచి తిరిగి వచ్చాక కొడుకు ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.