అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు... భార్యపైనా దాడి!
- భార్య పరిస్థితి విషమం
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
- నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన ఒన్నాలక్ష్మి, సుజాత తల్లీకూతుర్లు. సుజాత భర్త వీరిపై దాడికి పాల్పడడంతో లక్ష్మి చనిపోయింది. కొన ఊపిరితో ఉన్న సుజాతను స్థానికులు ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటన ఏ కారణంగా చోటుచేసుకుందన్న వివరాలు తెలియరాలేదు.