నేడు పులివెందులకు జగన్.. టూర్ వివరాలు ప్రకటించిన వైసీపీ
- ఈరోజు ఇంటికి చేరుకోనున్న జగన్
- రేపు క్యాంపు ఆఫీసులో ప్రజలతో సమావేశం
- సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొననున్న నేత
అనంతరం రేపు పులివెందుల పట్టణంలోని బకరాపురంలో ఉన్న తన క్యాంపు ఆఫీసులో ప్రజలను కలుసుకుంటారని చెప్పారు. ఆ తర్వాత సాయంత్రం పులివెందులలో వీకే ఫంక్షన్ హాల్ లో ఇఫ్తార్ విందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ నెల 16(ఎల్లుండి) బకరాపురంలో ప్రజలను మళ్లీ కలుసుకుంటారనీ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని అవినాశ్ రెడ్డి చెప్పారు.