ఆ క్షణంలోనే నా డైరీలోని పేజీలన్నీ చింపేశాను!: శివశంకర్ మాస్టర్
- ఎన్నో సినిమాలకి పనిచేశాను
- ఆ వివరాలు డైరీలో రాసుకునేవాడిని
- డైరీ చింపేయడానికి అదే కారణం
ఒక రోజున ఆ డైరీని పరిశీలనగా చూసుకుని .. ఇన్ని సినిమాలకి పని చేశానా? అనుకున్నాను. అంతే, అదే క్షణంలో ఆ డైరీలోని పేజీలను చింపేశాను. ఇక ఇప్పుడు నాకు ఎవరెవరితో ఎన్ని సినిమాలు చేశానో .. ఏయే పాటలకి డాన్స్ కంపోజ్ చేశానో గుర్తు లేదు. నేను ఇన్ని సినిమాలు చేశానా? అనే ఆలోచన వస్తే అక్కడే ఆగిపోతాను .. ముందుకు వెళ్లలేను. అందుకే డైరీ చింపేశాను .. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి అవకాశాన్ని మరింత ఉత్సాహంతో అందుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.