చిత్తూరులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం.. 17 మందికి గాయాలు!
- అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన బస్సు
- ఓ ప్రయాణికుడి పరిస్థితి విషమం
- బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఘటన
ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ బస్సు బెంగళూరు నుంచి తిరుపతికి ప్రయాణికులతో వస్తోందని తెలిపారు. డ్రైవర్ ఏమరపాటుగా ఉండటంతో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిందని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేశామనీ, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.