Kurnool District: యాక్సిడెంట్ ఎలా జరిగిందీ పోలీసులకు వివరించిన ట్రావెల్స్ బస్సు డ్రైవర్

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని మణిపాల్ వెళుతున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా వెల్దుర్తి చెక్ పోస్టు వద్ద తుఫాన్ వాహనాన్ని ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు విడిచారు. ఘటన జరిగిన సమయంలో ట్రావెల్స్ బస్సు, తుఫాన్ వాహనం రెండు కూడా అమిత వేగంతో ప్రయాణిస్తున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, ట్రావెల్స్ బస్సు డ్రైవర్ జోసెఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ బైక్ ను తప్పించే ప్రయత్నంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు డ్రైవర్ జోసెఫ్ పోలీసులకు తెలిపాడు. బైక్ ను ఢీకొన్న అనంతరం అదుపుతప్పి పక్క రోడ్ పైకి వెళ్లిందని, అదే సమయంలో ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని కూడా ఢీకొందని వివరించాడు.
Go Back to Shorts
Kurnool District

More Telugu News