తమిళనాడు ఇంజినీర్ అద్భుతం.. హైడ్రోజన్‌తో పనిచేస్తూ, ఆక్సిజన్‌ను విడుదల చేసే ఇంజిన్ సృష్టి
- శుద్ధి చేసిన నీటిని ఇంధనంగా ఉపయోగించుకునే ఇంజిన్
- అభివృద్ధికి పదేళ్లు పట్టిందన్న ఇంజినీర్
- త్వరలోనే జపాన్‌లో ఆవిష్కరణ
ఈ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి తనకు పదేళ్లు పట్టిందన్నాడు. ప్రపంచంలోనే ఇది తొలి ఆవిష్కరణ అని పేర్కొన్నాడు. త్వరలోనే దీనిని జపాన్‌లో ఆవిష్కరించనున్నట్టు తెలిపాడు. భారత్‌లోనూ దీనిని ఆవిష్కరించనున్నట్టు చెప్పాడు. ఈ ఎకో-ఫ్రెండ్లీ ఇంజిన్‌ను భారత్‌లోనే తొలుత పరిచయం చేయాలని భావించానని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో జపాన్ ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు కుమారస్వామి తెలిపాడు. వారి నుంచి తనకు సహకారం లభించిందని, త్వరలోనే అక్కడ ఈ ఇంజిన్‌ను ఆవిష్కరించనున్నట్టు వివరించాడు.