Narendra Modi: టైమ్ మ్యాగజైన్ కథనం నేపథ్యంలో.. మోదీపై విమర్శల స్పీడు పెంచిన కాంగ్రెస్

షార్ట్స్‌లో చూడండి
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేతలు విమర్శల దాడి ముమ్మరం చేశారు. నరేంద్ర మోదీ ఎలాంటివాడో, అతడి ఆలోచనలు ఎలా ఉంటాయో అంతర్జాతీయంగా పేరుపొందిన టైమ్ మ్యాగజైన్ వెల్లడించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. 'విభజించు, పాలించు' రాజకీయాలకు సంబంధించి 'ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్' పేరుతో మోదీపై టైమ్ మ్యాగజైన్ లో విమర్శనాత్మక కథనం రావడం తెలిసిందే. దీన్ని ఆధారంగా చేసుకునే కాంగ్రెస్ తన అస్త్రాలకు పదునుపెట్టింది.

'విభజించు, పాలించు' అనేది బ్రిటీష్ వాళ్ల సిద్ధాంతం అని, అప్పట్లో దేశాన్ని పట్టి పీడించిన బ్రిటీష్ వాళ్లను కాంగ్రెస్ తరిమికొట్టిందని, ఇప్పుడు వాళ్ల అడుగుజాడల్లోనే నడుస్తున్న మోదీని కూడా అదేరీతిలో గద్దె దింపుతాం అని సూర్జేవాలా వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Narendra Modi
Congress

More Telugu News