అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
- వాదనలు విననున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
- నాలుగు రోజుల క్రితం నివేదిక సమర్పించిన మధ్యవర్తిత్వ ప్యానెల్
- ఈ నివేదికను కూడా సమీక్షించనున్న ధర్మాసనం
మరోవైపు, ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ను సుప్రీంకోర్టు నియమించింది. ఈ ప్యానెల్ లో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఖలీవుల్లా, లాయర్ శ్రీరామ్ పంచు ఉన్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ ప్యానెల్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈరోజు ఈ నివేదికను కూడా సుప్రీం ధర్మాసనం సమీక్షించనుంది.