డబ్బు కోసం ఆ సినిమా చేయవలసి వచ్చింది .. అదే పొరపాటైంది: 'బిగ్ బాస్' కౌశల్
- సినిమా ఆఫీసులచుట్టూ తిరిగాను
- మోడలింగ్ పై దృష్టి పెట్టాను
- పరిస్థితుల వల్లనే కెరియర్ దెబ్బతింది
కెరియర్ పరంగా నేను సతమతమవుతున్న రోజుల్లోనే మా అమ్మకి కేన్సర్ వచ్చింది. ఆమె ట్రీట్మెంట్ కి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైంది. అలాంటి పరిస్థితుల్లో ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా నేను చేయకుండా ఉండవలసింది .. కానీ నాకు డబ్బు అవసరం. ఆ సినిమా చేయడం వలన వచ్చే డబ్బులు అమ్మ ట్రీట్మెంట్ కి ఉపయోగపడుతుందని భావించి ఆ సినిమా చేశాను. నటుడిగా నా కెరియర్ దెబ్బతినడానికి ఆ సినిమాయే కారణం" అంటూ చెప్పుకొచ్చాడు.