హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి పోలీస్ కస్టడీ
- నిందితుడికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ
- రేపటి నుంచి ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతి
- ఈ మేరకు నల్గొండ జిల్లా కోర్టు ఆదేశాలు
నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నల్గొండ మొదటి అదనపు జిల్లా కోర్టును రాచకొండ పోలీసులు తొలుత ఆశ్రయించారు. అయితే, ఈ కోర్టుకు ప్రస్తుతం సెలవులు ఉన్నాయి. దీంతో, ఈ కేసు విచారణాధికారి, భువనగిరి ఏసీపీ భుజంగరావు అర్జీ మేరకు నల్గొండ జిల్లా కోర్టులో ఓ పిటిషన్ ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నలమాడ గోపాల కృష్ణ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జిల్లా ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టడం జరిగింది.