ప్రజాశాంతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చంద్రబాబు సర్వేలో తేలింది: కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రపంచ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ మరోసారి రాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ప్రజాశాంతి పార్టీకి ఈ ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయన్న విషయం చంద్రబాబు సర్వేలో తేలిందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మనసు మార్చుకుంటే ఆయన కోసం ప్రార్థన చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 23న కౌంటింగ్ అనంతరం రాష్ట్ర ప్రజలకు వాస్తవం బోధపడుతుందని, ఏపీ సీఎం ఎవరో నిర్ణయించేది తానేనని పాల్ చెప్పుకొచ్చారు. అయితే, ఈసారి చంద్రబాబుకు రిటైర్మెంట్ ఇచ్చి మనిద్దరం కలిసి పనిచేద్దాం అంటూ జగన్ కు ప్రతిపాదన చేశారు. నిజాయతీ విషయంలో తనకు సాటి మరెవరూ లేరని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
KA Paul

More Telugu News