డ్రగ్స్ రాజధానిగా విశాఖ మారుతుందేమో!: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
- విశాఖ సంస్కృతిని దెబ్బ తీసేలా రేవ్ పార్టీలు
- ఈ కేసులో అసలు నిందితులను తప్పించారు
- ఓ మంత్రి అండదండలతోనే ఇక్కడ రేవ్ పార్టీ జరిగింది
ఈ పార్టీలో పది మంది యువతులు పాల్గొన్నారని, మద్యం తాగేందుకని ఎక్సైజ్ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బీజ్ ఫ్రంట్ నిర్వాహకులను అరెస్టు చేయాలని డీజీపీ చెప్పినా పోలీసులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకుంటే డ్రగ్స్ రాజధానిగా విశాఖ మారుతుందేమోనని విష్ణుకుమార్ రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.