Andhra Pradesh: పేకాట రాయుళ్లపై నెల్లూరు పోలీసుల పంజా.. 82 మంది అరెస్ట్!

  • నెల్లూరులోని పడుగుపాడులో ఘటన
  • ఫ్రెండ్స్ కల్చర్ క్లబ్ పై దాడి
  • క్లబ్ నిర్వహిస్తున్న మాజీ పోలీస్ అధికారి

నెల్లూరు జిల్లాలో ఈరోజు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని పడుగుపాడులో ఉన్న ఫ్రెండ్స్ కల్చర్ క్లబ్ పై దాడిచేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 82 మందిని అరెస్ట్ చేశారు.

15 ఖరీదైన కార్లతో పాటు రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ 82 మందిని నెల్లూరులోని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్లబ్ ను స్వయంగా మాజీ పోలీస్ అధికారి ఒకరు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు విస్తుపోయారు.

More Telugu News