నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా.. మళ్లీ అధికారం చేపట్టబోతున్నాం!: సీఎం చంద్రబాబు

  • 100 శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం
  • ఏపీలో ఇప్పుడు అందరి స్వరాలు మారుతున్నాయి
  • అమరావతిలో టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ లో 100 శాతం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామనీ, ఇందులో ఎలాంటి అనుమానం లేదని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో అన్ని నివేదికలు పరిశీలించి ఈ విషయాన్ని చెబుతున్నానని స్పష్టం చేశారు. కాలం గడిచేకొద్దీ ఏపీలో అందరి స్వరాలు మారుతున్నాయని వ్యాఖ్యానించారు.

బుకాయించి ఆధిపత్యం చెలాయించాలనుకోవడం సాధ్యం కాదని తేలిపోయిందని చెప్పారు. అమరావతిలో టీడీపీ నేతలు, బూత్ స్థాయి కన్వీనర్లు, సేవామిత్రలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో బాబు ఈరోజు మాట్లాడారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమనీ, ఎంత మెజారిటీతో వస్తామన్నదే ఇప్పుడు తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
teleconference
Telugudesam

More Telugu News